Monday, September 15, 2008

సీతాఫలం ఎంతో బలం

నేను మొన్న శ్రావణ మాసం నోములకి వెళ్ళి నప్పుడూ మా అన్నయ్య గారి కవల పిల్లల్లు(అమ్మాయి,అబ్బాయి) ప్రీ primary చదువుతున్నా చక్కగా పాఠశాల లో చెప్పినవి అన్నీ మాకు చెప్పారు.
ఐతే అందులో నాకు వాళ్ళు చెప్పినట్టుగా( action & feel) రాయలేను గాని
మీరే పిల్లల్లు ఎలా చెప్తారో ఊహించుకుంటూ.... చదవండి :)
సీతాఫలం............. ఎంతో బలం............
అందులో వుంది.........తీ.....యని గుజ్జు.....................బుజ్జి...............
గుజ్జు తిని ..............గింజపరెయ్.........(పడేయ్ కి వాళ్ళు పరెయ్):)))))

ఇంకా చాలా చెప్పారు, వాళ్లకి వొక్కొ chocolate ఇస్తూ ఎన్ని సార్లు చెప్పించుకున్నానో ఈ పాఠాన్ని
క్రిష్ణాష్తమి కి వాళ్ళ school లో చిన్న programe conduct చేశారట, వళ్లకీ నెమలిపించం చెప్పటం రాక
అత్తా (తల మీద చెయ్యి పెట్టి) ఇక్కర కూరా పెట్టుకున్నారు క్రిస్నురు(క్రిష్ణుడు) అని pose పెట్టారు:))))
అల్లరి పిల్లలు చక్కాగా ఇవన్ని చెపుతుంటె ఎంత ముచ్చటేసిందో....

Friday, August 1, 2008

అమ్మ

ధిమిత ధిమిత - ఏమి ధిమిత?
పసుపు ధిమిత - ఏమి పసుపు?
వంట పసుపు - ఏమి వంట?
పిండి వంట - ఏమి పిండి?
తెలగ పిండి - ఏమి తెలగ?
గొర్రె తెలగ - ఏమి గొర్రె?
కొమ్ము గొర్రె - ఏమి కొమ్ము?
ఏనుగు కొమ్ము - ఏమి ఏనుగు?
మదుపుటేనుగు - ఏమి మదం?
ఆముదం - ఏమాముదం?
చిట్టాముదం -ఏమి చిట్టు?
సరి చిట్టు- ఏమి సరి?
దాసరి - ఏమి దాసు?
కాళిదాసు - ఏమి కాళి?
భద్రకాళి - ఏమి భద్ర?
తుంగభద్ర - ఏమి తుంగ?
నీటి తుంగ - ఏమి నీరు?
ఉప్పు నీరు - ఏమి ఉప్పు?
పెట్లుప్పు - ఏమి పెట్లు?
గుర్రపు పెట్లు - ఏమి గుర్రం?
పటాణి గుర్రం - ఏమి పటం?
గాలిపటం - ఏమి గాలి?
సుడిగాలి - ఏమి సుడి?
అరటిసుడి - ఎమి అరటి?
బొంత అరటి - ఏమి బొంత?
కంబళి బొంత - ఏమి కంబళి?
రత్నకంబళి - ఏమి రత్న?
నవరత్న - ఏమి నవ?
గోరు నవ - ఏమి గోరు?
పులిగోరు - ఏమి పులి?
పెద్ద పులి - ఏమి పెద్ద?
మా పెద్ద - ఏమి మా?
అమ్మ :)
ఈ టపా లో రాసినది , ఈ నెల రుషిపీఠం ప్రచూరితమైనది ,
నాకు అమ్మ concept బాగ నచ్చి మీతో పంచుకోవాలని రాసను

Monday, July 7, 2008

సుత్తి మేళం

అహా.........
అందరు వెళ్ళి పోయారు......... అన్ని పనులూ ఐపోతున్నాయి.......:)
పొద్దునుంచి అలసి పోయాను............ బట్టలు ఆరేసి పడుకుందాము అనుకున్నాను?
సరే వాషింగ్ మషిన్ నుంచి బట్టలు బక్కెట్ లోకి తీసి పైకెక్కి..........
ఆరవేయడం మొదలెట్టాను......:)

అబ్బా ఎండ కుడా బాగా వస్తొంది ఇంకే............
పడుకుని లేచేసరికి ఆరిపోతాయి..... :)
ఇంతలో ఒకడు కింద నుంచి ఆంటీ.................................... అని పిలిచాడు...............
సరే అని తొంగి చూశాను...ఒక పిల్లవాడు వీపుకి పార తగిలించు కుని చేత్తో సైగ చేస్తున్నాడు?
నాకు అర్ధం కాక క్యాఆఆఆఆఆ.................. అన్నాను ?????????? అక్కడ language problem వాడికి కన్నడా, కొంచం హింది వచ్చు .మా ఇంటి పక్కన ఖాళి స్థలం లేండి, వానలు పడి అక్కడ పిచ్చి మొక్కలు మొలిచాయి ..................
ఐతే అవి చూపించి కట్(సైగ) చెస్తానంటాడు.... సరే అన్నాను............... కాసూ(పైసలు - అది సైగే)....................... నహి నహి...అంటా నేను :) మళ్ళి అదే తంతు వెల్లడే ఒక పట్టాన.....(వీడేవడురా బాబు.....) అనుకున్నా సరే వచ్చి రాని కన్నడా లో ఎష్తో(yesto) అన్నా ,వాడు తెలివిగా 25 దేదో అని మళ్ళి సైగ చెస్తున్నాడు మా గోడ దగ్గరున్న కొంచం మేర చూపిస్తు(cut చేయటానికి) ,ఐతే ఆ కాస్తకి పాతిక ఎందుకు 1o(దస్) అన్నా సరే అన్నాడు ఇహహహహహహ... మొదలెట్టాడు పని.. ఏమిటి నేను మళ్ళి అటు తిరిగి 2నిమిషాలు అవ్వలేదు మళ్ళి ఆంటిఇఇఇఇఇ...........అన్నాడు.క్యా అంటే................... అయిపోయిందని (సైగె చెశాడు మళ్ళీ) ..................ఎమిటి ఇంత త్వరగా! అని తొంగి చుస్తె.........!!!!!!!!!!! వాడు ఉన్న ఆ నాలుగు మొక్కలు పీకి కుర్చున్నాడు(వారినిఇఇఇఇఇఇఇఇఇఇఇఇ) అనుకున్నా,నేను సైగ చేసి అక్కడిదంతా పీకు అన్నా ..............వాడు మళ్ళీ (సైగ) 50 కుడు(ఇవ్వు) ఇది ఎల్లా(మొత్తం) clean చేస్తానంటాడు. నేను నక్కొ నక్కొ... అన్నాను వాడు సరాసరి పైకి వచ్చాడు(మేము 1st floor) లో వుంటాము లేండి కాలింగ్ బెల్ కొట్టాడు...అమ్మొ అనుకుని గబగబాఆఆఆఆఆఆఆఆఆఆ వచ్చా .... తలుపు తీసా....వాడు ..... కాసు కాసు అంటాడు..........................ఐతే నేను నీ కీడ పో(కిందకి వెళ్ళూ) అని అరవం లో అన్నాను.... వాడు మా ఇంటి వరండా లో వున్న కాకరపువొత్తుల డబ్బా చుపించి తీసికెళ్ళనా అన్నడు(మళ్ళి సైగే) ..????????? ఆ.. అని కాసు ఇల్లా అన్నా(అవును మరి ఆ డబ్బా విలువ 25 వుండదు..:)) ఐతే వాడు కామ్ గా దాన్ని అక్కడే పెట్టి కాసు కాసు అన్నాడు ఐతే నేను కీడ(కిందకి) పో అన్నా ,వాడు వెళ్ళాక ,నేను వెళ్ళి 10రుపాయలు తెచ్చి ఇచ్చా,,,,,, వాడు 25 బేకు అంటాడు నెను నహి నహి మే దస్ (10) బోలా హై, 25 నహి అన్నా :( అంతే వాడు ఇంక ఆ 10 రుపాయలు అక్కద పెట్టి నకక్కరలేదు పోంమంటాడు.... వామ్మొ వీడేవడురా బాబు ఇలా జిడ్డు లా అతుక్కున్నాడు అనుకున్నాను,,,,,,, అక్కడే నుంచున్నాను,,,,,,,,కాసేపటికి వాడు తిండి తిండి అన్నాడు,,,,, ఐతే అప్పుడు రాత్రి మిగిలిన ఉప్మా ఇద్దామని వెలిగింది tubelight .... సరే అని గబగబా వెళ్ళి ఒక కవరు లో వేసి తీసుకొచ్చి ఇచ్చాను.వాడు ఆ 10 రుపాయలు ఉప్మా తీసుకుని వెళ్ళాడు. హమ్మయ్యా ష్..................... అనుకున్నాను.మా వారు office నుంచి రాగానే చెప్పా..... ఆయన నవ్వి ఊరుకున్నారు :) ,,,, మర్నాడు పొద్దునే 8దింటికి మళ్ళి అదే గొంతు ఆంటిఇఇఇఇఇ............... నేనేమొ వంటా హడావిడి లో వున్నా వచ్చి చుస్తే వీడు ............... తుమ్ జావో........ అని మొహంమీదే తలుపేసాను. నా అద్రుష్టం మా వారు ఇంకా office కి వెళ్ళలేదు....:) యెమండి నిన్న చెప్పానే వాడు వచ్చడు అన్నా.... మరి నన్ను పిలవక పోయావా వాడి దర్శనం చెసుకునే వాడిని కదా అన్నారు :) ఐతే అదిగో ఇంకా ఇక్కడే వున్నాడు అన్నా ఆయన వచ్చి చుసి ఎన్నా..అన్నారు ఐతే వాడు ఎదొ 25 clean మాడ్తిని అని అన్నాడు మొత్తానికి ఆయన మాట్లాడి నీ మొదల్లా హోగు(వెళ్ళూ) అన్నారు ,ఐతే వాడు మళ్ళి cont.. చెస్తున్నాడు ఈయన గట్టిగా హోగు...................................... అన్నారు. వాడు వెళ్ళాక నా దెగ్గరకొచ్చి నీకు భలే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు, కదా అని వెళ్ళీ పోయారు..:)
మొత్తానికి వదిలాడులే అనుకుని ఊపిరి పీల్చుకున్నాను:))))))))))))))))))))))

Friday, April 25, 2008

chaduvu valla yemi prayoojanam

ప్రేమ స్వరూపులారా! విధ్యర్ధులారా!మీరెన్నియో చదువులు చదువుతున్నరు.
కాని, మీ అంతరంగము పరిశుద్ధంగా లేకపోతే ఎన్ని చదువులు చదివినాగాని ఏమి ప్రయోజనం?
"చదువులన్నియు చదివి చాల వివేకి i మదిని తన్నెరుగడు మందమతుడు."
తననిజతత్వమును తాను తెలుసుకోకుండా మానవుడు ఎన్ని చదువులు చదివితే ఏమి ప్రయోజనం?
"చదువులన్నియు చదివి చావంగనేటికి? చవు లేని చదువు చదవవలయు."
మీ చదువులు సమాజానికి ఉపయోగపడాలి.మీరు చదివిన చదువును పదిమందికి నేర్పాలి.
అప్పుడే మీ మానవత్వము విశాలమవుతుంది.వ్యష్టి అంటే ఒకటి.కాని,దాని ప్రక్కన రెండవది చేరిందంటే,అది సమష్టి అవుతుంది
వ్యష్టి సమష్టితో ఏకం కావాలి.
(ఇది సనాతన సారథి అనే పుస్తకము నుంది రాయబడినది - april 2008)

Wednesday, April 16, 2008

iMtiMti ramayanam

Amdari intlo vuMdee bhagootamee
Wife:yemandi baitiki vedadaama?
Husband:ledooey naaku office work chala vuMdi paiga repuee ma manager ki update ivvali
W : mereppudu iMteee hmm....
H : iMka yemti kaburlu?
nenu pani chesukuMtoo viMtaanu:)
W : (na mogudee kada viMtanannadi anukuni paapam picchi pilla)
Aa roju chesinavvani cheppi taravaata kadaMdi aniMdi
rendu moodu saarlu kadaMdi kadaMdi annaka
gattiga Yemandi ani pilichiMdi
(papam paniloo vunnamogudu gabukkuna olliki padi)
H : yemitoi yemmanavvoo vini pinchukooleedu
malli cheppava annadu
W : meeru yeppudu vinipiMchu kunnaru
nenu iMtee meeru amtee
aina meeru yenduku pelli chesukunnaroo yemitoo
yee officeoo sthapiMchina vaadi kuturinoo leeda meelagee pani cheesee yee collegue noo pelli chesukoovalasiMdi
(chi aMtuu bharya vellipootuMdi vantintlooki)
H : Yemitoo ee adavaallu:)
(malli modallu pettadu office pani):)