Monday, September 15, 2008

సీతాఫలం ఎంతో బలం

నేను మొన్న శ్రావణ మాసం నోములకి వెళ్ళి నప్పుడూ మా అన్నయ్య గారి కవల పిల్లల్లు(అమ్మాయి,అబ్బాయి) ప్రీ primary చదువుతున్నా చక్కగా పాఠశాల లో చెప్పినవి అన్నీ మాకు చెప్పారు.
ఐతే అందులో నాకు వాళ్ళు చెప్పినట్టుగా( action & feel) రాయలేను గాని
మీరే పిల్లల్లు ఎలా చెప్తారో ఊహించుకుంటూ.... చదవండి :)
సీతాఫలం............. ఎంతో బలం............
అందులో వుంది.........తీ.....యని గుజ్జు.....................బుజ్జి...............
గుజ్జు తిని ..............గింజపరెయ్.........(పడేయ్ కి వాళ్ళు పరెయ్):)))))

ఇంకా చాలా చెప్పారు, వాళ్లకి వొక్కొ chocolate ఇస్తూ ఎన్ని సార్లు చెప్పించుకున్నానో ఈ పాఠాన్ని
క్రిష్ణాష్తమి కి వాళ్ళ school లో చిన్న programe conduct చేశారట, వళ్లకీ నెమలిపించం చెప్పటం రాక
అత్తా (తల మీద చెయ్యి పెట్టి) ఇక్కర కూరా పెట్టుకున్నారు క్రిస్నురు(క్రిష్ణుడు) అని pose పెట్టారు:))))
అల్లరి పిల్లలు చక్కాగా ఇవన్ని చెపుతుంటె ఎంత ముచ్చటేసిందో....