Friday, April 25, 2008

chaduvu valla yemi prayoojanam

ప్రేమ స్వరూపులారా! విధ్యర్ధులారా!మీరెన్నియో చదువులు చదువుతున్నరు.
కాని, మీ అంతరంగము పరిశుద్ధంగా లేకపోతే ఎన్ని చదువులు చదివినాగాని ఏమి ప్రయోజనం?
"చదువులన్నియు చదివి చాల వివేకి i మదిని తన్నెరుగడు మందమతుడు."
తననిజతత్వమును తాను తెలుసుకోకుండా మానవుడు ఎన్ని చదువులు చదివితే ఏమి ప్రయోజనం?
"చదువులన్నియు చదివి చావంగనేటికి? చవు లేని చదువు చదవవలయు."
మీ చదువులు సమాజానికి ఉపయోగపడాలి.మీరు చదివిన చదువును పదిమందికి నేర్పాలి.
అప్పుడే మీ మానవత్వము విశాలమవుతుంది.వ్యష్టి అంటే ఒకటి.కాని,దాని ప్రక్కన రెండవది చేరిందంటే,అది సమష్టి అవుతుంది
వ్యష్టి సమష్టితో ఏకం కావాలి.
(ఇది సనాతన సారథి అనే పుస్తకము నుంది రాయబడినది - april 2008)

No comments: