Friday, August 1, 2008

అమ్మ

ధిమిత ధిమిత - ఏమి ధిమిత?
పసుపు ధిమిత - ఏమి పసుపు?
వంట పసుపు - ఏమి వంట?
పిండి వంట - ఏమి పిండి?
తెలగ పిండి - ఏమి తెలగ?
గొర్రె తెలగ - ఏమి గొర్రె?
కొమ్ము గొర్రె - ఏమి కొమ్ము?
ఏనుగు కొమ్ము - ఏమి ఏనుగు?
మదుపుటేనుగు - ఏమి మదం?
ఆముదం - ఏమాముదం?
చిట్టాముదం -ఏమి చిట్టు?
సరి చిట్టు- ఏమి సరి?
దాసరి - ఏమి దాసు?
కాళిదాసు - ఏమి కాళి?
భద్రకాళి - ఏమి భద్ర?
తుంగభద్ర - ఏమి తుంగ?
నీటి తుంగ - ఏమి నీరు?
ఉప్పు నీరు - ఏమి ఉప్పు?
పెట్లుప్పు - ఏమి పెట్లు?
గుర్రపు పెట్లు - ఏమి గుర్రం?
పటాణి గుర్రం - ఏమి పటం?
గాలిపటం - ఏమి గాలి?
సుడిగాలి - ఏమి సుడి?
అరటిసుడి - ఎమి అరటి?
బొంత అరటి - ఏమి బొంత?
కంబళి బొంత - ఏమి కంబళి?
రత్నకంబళి - ఏమి రత్న?
నవరత్న - ఏమి నవ?
గోరు నవ - ఏమి గోరు?
పులిగోరు - ఏమి పులి?
పెద్ద పులి - ఏమి పెద్ద?
మా పెద్ద - ఏమి మా?
అమ్మ :)
ఈ టపా లో రాసినది , ఈ నెల రుషిపీఠం ప్రచూరితమైనది ,
నాకు అమ్మ concept బాగ నచ్చి మీతో పంచుకోవాలని రాసను

9 comments:

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

బావుంది అమ్మ పాట. ఆటలా ఉన్న ఈ పాటలో ఎన్ని చక్కని తెలుగు నుడికారపు పదాలు ఉన్నాయో.... ఇందులో నాకు తెలియని పదాలు....

గొర్రె తెలగ, సరి చిట్టు, పెట్లుప్పు, గుర్రపు పెట్లు, గోరు నవ

వీటి గురించి తెలుసుకోవలి...

పద్మనాభం దూర్వాసుల said...

ధన్యవాదాలు. పాత రోజులు గుర్తు చెశారు

సుజాత వేల్పూరి said...

ఆగండాగండి, మీరు రాసింది చదువుతుండగానె గుర్తొచ్చేసింది! చిన్నప్పుడు స్కూల్లో ఆగకుండా దీన్ని ఊపిరి బిగబట్టి చెప్పేసేవాళ్ళం! కాపీ చేసుకోవాలి, మా పాపకోసం!

calyen said...

బావుంది బావుంది!

సిరిసిరిమువ్వ said...

బావుంది. మేము ఇంకొక విధంగా పాడేవాళ్ళం.

ధిమిత ధిమిత - ఏమి ధిమిత?
పసుపు ధిమిత - ఏమి పసుపు?
ఆకు పసుపు-ఏమి ఆకు?
తమలపాకు-ఏం తమ్మ?
పుట్ట తమ్మ-ఏం పుట్ట?
పాము పుట్ట-ఏం పాము?
త్రాచు పాము-ఏం త్రాచు?
నల్ల త్రాచు-ఏం నల్ల?
కాకి నల్ల-ఏం కాకి?
మాల కాకి-ఏం మాల?
పూల మాల-ఏం పూలు?
మల్లె పూలు-ఏం మల్లె?
గుండు మల్లె-ఏం గుండు?
గోలి గుండు-ఏం గోలి?
మట్టి గోలి-ఏం మట్టి?
బంకమట్టి-ఏం బంక?
తుమ్మ బంక-ఏం తుమ్మ?
పిచ్చి తుమ్మ-ఏం పిచ్చి ?
వేప పిచ్చి-ఏం వేప?
తురక వేప-ఏం తురక?
నీ ముక్కు కొరక....

ఇలాంటి పాటల వల్ల పిల్లలకి పద సంపద పెరుగుతుంది,కానీ ఇప్పుడు ఇలాంటి వాటిని నేర్పేది ఎవరు?

హర్షోల్లాసం said...

@హర్ష నాకే ఇందులో సగం పదాలు తెలవ్వు:)
@పద్మనాభం గారు దన్యవాదాలు,ఒక చిన్న ప్రశ్నండి మీ పేరు పక్కన దూర్వాసుల మీ ఇంటి పేరా లేక మీకు ఆ ముని లాగా కొపం ఎక్కువా? :)
@సుజత గారు నాకు మీరే inspiration తెలుసా:)మీ పెళ్ళంటే నూరేళ్ళ వంటా? నుంచి మీ
అభిమానినయ్యనండి బాబు అసల మీ చమత్కార పదజాలం తో భలే గా రాస్తారండి మీ ఆ టపా లో Mr.&Mrs.హర్ష నేనే :),ధన్యవాదాలు:),తప్పకుండా కాపీ చెసుకొండి:)
@కళ్యాణ్ బాగున్నావా? ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ గారు మీరు అన్నది నిజమే, నా చిన్నప్పుడు అరవం లో ఏదో ఇటువంటిదే అన్నట్టు గుర్తు కాని నేనే మర్చాను.ఇది చూశాక నాకే సిగేసింది.

MURALI said...

బావుంది

హర్షోల్లాసం said...

@ మురళి ధన్యవాదాలు

Unknown said...

బావుంది